البحث

عبارات مقترحة:

الجواد

كلمة (الجواد) في اللغة صفة مشبهة على وزن (فَعال) وهو الكريم...

سورة النساء - الآية 92 : الترجمة التلجوية

تفسير الآية

﴿وَمَا كَانَ لِمُؤْمِنٍ أَنْ يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَأً ۚ وَمَنْ قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ وَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ إِلَّا أَنْ يَصَّدَّقُوا ۚ فَإِنْ كَانَ مِنْ قَوْمٍ عَدُوٍّ لَكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ ۖ وَإِنْ كَانَ مِنْ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِيثَاقٌ فَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ ۖ فَمَنْ لَمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِنَ اللَّهِ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا﴾

التفسير

మరియు - పొరపాటుగా తప్ప - ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని (నిషిద్ధం). మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపిన వాడు (దానికి పరిహారంగా) అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి మరియు హతుని కుటుంబీకులకు (వారసులకు) రక్తపరిహారం (దియత్) కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం (సదఖ) అవుతుంది! కాని ఒకవేళ వధింపబడిన వాడు విశ్వాసి అయి, మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే, ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ (వధింప బడిన వాడు) - మీరు ఒడంబడిక చేసుకొని వున్న జనులకు చెందిన వాడైతే - రక్త పరిహారం అతని కుటుంబీకులకు (వారసులకు) ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస (ముస్లిం) బానిసకు విముక్తి కలిగించాలి. (బానిసకు విముక్తి కలిగించే) శక్తిలేని వాడు, వరుసగా రెండు నెలలు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడటానికి (ఇదే సరైన పద్ధతి). అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

المصدر

الترجمة التلجوية