الرءوف
كلمةُ (الرَّؤُوف) في اللغة صيغةُ مبالغة من (الرأفةِ)، وهي أرَقُّ...
అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు.
అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి!
తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);
అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే!
మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము.
మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.
మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి;
వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.
మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;
అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు.
అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.
అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు.
కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు.
కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు.